బీఆర్ఎస్‌కు మరో మాజీ మంత్రి గుడ్ బై.. మేయర్‌తో పాటే కాంగ్రెస్‌లో చేరిక!

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌కు మరో మాజీ మంత్రి గుడ్ బై.. మేయర్‌తో పాటే కాంగ్రెస్‌లో చేరిక!
X

దిశ, వెబ్‌డెస్క్: కీలక సమయంలో వరుసబెట్టి ముఖ్య నేతలంతా బీఆర్ఎస్‌ అధిష్టానానికి షాకిస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లు రాజ్యసభ్య సభ్యుడు కేకే, ఆయన కుమార్తె విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్‌ పెద్దల స్పష్టమైన హామీతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకునేలోపే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటే చేరనున్నట్లు తెలిసింది.

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి ఎట్టకేలకు చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఫామ్‌‌హౌజ్‌లో కేకే చర్చలు జరిపి తిరిగి హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్న వెంటనే ఇంద్రకరణ్‌రెడ్డి వెళ్లి కలిశారు. కాంగ్రెస్‌లో చేరడంపై ఇద్దరూ కలిసి చర్చించుకున్నారు. చేరిక ముహూర్తాన్ని స్వయంగా ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించకపోయినా కేకే మాత్రం ధ్రువీకరించారు. ఈ నెల 30న రేవంత్‌రెడ్డి సమక్షంలో లాంఛనంగా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఎలాగూ కేకే నివాసానికి రేవంత్‌రెడ్డి ఆ రోజున వస్తున్నందున ఆ ఇంట్లోనే ఇంద్రకరణ్ రెడ్డి చేరే అవకాశాలున్నాయి.


Next Story

Most Viewed