టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు

by Disha Web Desk 4 |
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు
X

దిశ, క్రైమ్​ బ్యూరో‌‌ : మాజీ టాస్క్​ఫోర్స్​డీసీపీ రాధాకిషన్​ రావు దౌర్జన్యంపై బుధవారం ఓ బాధితుడు కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూకట్​పల్లి ప్రాంతానికి చెందిన మునగపాటి సుదర్శన్​తనకు సంబంధించిన రూ. కోటి విలువ చేసే ఫ్లాట్‌ను అక్రమంగా తనను నిర్భంధించి రాధాకిషన్​రావు తన టీంతో కలిసి బెదిరించి వారి మనుషులకు తక్కువ ధరకు కట్టబెట్టారని బాధితుడు ఫిర్యాదు చేశారు. దీనిపై కూకట్​పల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. రాధాకిషన్​రావు, అతని టీం గన్​పాయింట్​పెట్టి బెదిరించారని తెలిసింది. హైదరాబాద్​ పోలీసులు కస్టడి విచారణ పూర్తైన తర్వాత కూకట్​పల్లి పోలీసులు రాధాకిషన్​రావును అరెస్టు చేసే అవకాశం ఉంది.


Next Story

Most Viewed