- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మరోసారి తెరపైకి అమ్నీషియా పబ్.. ఒక్క లైసెన్స్‌తో ఎన్ని పబ్‌లు నడిపిస్తుందంటే?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించడంతో హైదరాబాద్‌లోని పబ్బులపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ ఒక్క బార్ లైసెన్స్‌తో మూడు పబ్‌లను నడుపుతున్నట్లు తెలుస్తోంది. అమ్నీషియా, ఇన్ సొమ్నియ, వొయ్లా పేర్లతో మూడు పబ్స్‌ని నిర్వహిస్తున్నారు. ఇండియన్ బూజింగ్ కంపెనీ పేరుతో ఎక్సైజ్ శాఖ బార్ లైసెన్స్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మూడు ఫ్లోర్లలో వేర్వేరు పేర్లతో అమ్నీషియా యాజమాన్యం పబ్‌ల నిర్వహణ చేపడుతుంది. దీంతో, ఒక్కొక్కటిగా పబ్ యాజమాన్యం వింత పోకడలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా, పబ్ నిర్వాహకులు ఎక్సైజ్, పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తు్న్నారు. ఒక్కో అంతస్తులో ఒక్కో పేరుతో పబ్స్ నిర్వహణ చేపట్టడంతో.. ఇంకా ఈ పబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.