అంబర్ పేట కుక్కల దాడి ఘటన : సర్కారు కీలక నిర్ణయం

by Disha Web Desk 4 |
అంబర్ పేట కుక్కల దాడి ఘటన : సర్కారు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కల దాడిలో అంబర్ పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు బుధవారం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే కుక్కల దాడి ఘటనలో అప్రమత్తమైన ప్రభుత్వం కుక్క కాటు నియంత్రణపై 13 అంశాలతో మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ క్రమంలో స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. హెల్ప్ లైన్ నంబర్ 040 - 2111 1111 తీసుకువచ్చింది. ఈ ఘటనపై గురువారం సమీక్ష నిర్వహించిన తలసాని మాట్లాడుతూ.. ఘటన బాధాకరమన్నారు. మేయర్ వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయన్నారు. కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీమ్స్ తో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Next Story

Most Viewed