వినతిపత్రం ఇవ్వానికిపోతే అరెస్టులు చేస్తారా?: ఓయూ విద్యార్థి సంఘాలు

by Disha Web Desk 2 |
వినతిపత్రం ఇవ్వానికిపోతే అరెస్టులు చేస్తారా?: ఓయూ విద్యార్థి సంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓయూ వీసీకి పీహెచ్‌డీ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు జరిగిన అన్యాయం జరిగిందని వీసీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థులను వీసీ కలవకుండా అక్రమంగా అరెస్టు చేయించారని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వీసీ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీనిని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. యూనివర్సిటీని అడ్డుపెట్టుకొని వీసీ వ్యక్తిగతంగా రాజకీయంగా లబ్ధి పొందడం కొరకు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ అభివృద్ధి గురించి కోసం వీసీ ఆలోచించడం లేదని వారు విమర్శించారు. అరెస్టులు, కేసులతో ఓయూ విద్యార్థుల చైతన్యాన్ని ఆపలేరని వారు హెచ్చరించారు. ఓయూకి స్వయం ప్రతిపత్తి గల హోదా ఉంది కాబట్టి మొదటి తరం విద్యార్థులమైన మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు పరిశోధన చేయడానికి యూనివర్సిటీ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. మొత్తం 21 మంది విద్యార్థులను అరెస్టు చేశారని తెలిపారు.


Next Story

Most Viewed