అక్కడ ప్లాటు కొనుగోలు చేస్తున్నారా?.. ఇల్లు కట్టుకునే వరకు టార్చర్ తప్పదా?

by Disha Web Desk 2 |
అక్కడ ప్లాటు కొనుగోలు చేస్తున్నారా?.. ఇల్లు కట్టుకునే వరకు టార్చర్ తప్పదా?
X

దిశ, అల్వాల్: అక్రమ నిర్మాణాలకు నిలయంగా అల్వాల్ సర్కిల్ మారింది. ఇక్కడ రకరకాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరుగుతుంటాయి. ఆక్రమించి అమ్మినవాడు కోట్లకు పడిగెత్తితే కొన్నవాడు మాత్రం నానా గడ్డికర్చి ప్లాటు కొనుకున్నామనే సంతృప్తి మిగులకుండా దినదిన గండంగా ఉంటుంది అంటున్నారు. పైసాపైస కూడేసుకొని తెలిసి తెలియక సర్వేనంబర్ 313లో ప్లాటు కొని చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇల్లు కట్టుకుందామంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వదు అమ్మినవాడిని అడిగితే సప్పుడు చేయడు ఇద్దరి మధ్య నలిగిపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాటు చుట్టూ ప్రహరీ కట్టి గేటు పెట్టి ఇంటి నంబర్ సైతం జీహెచ్ఎంసీ ఇచ్చిన ప్లాటును కొంటే ఇప్పడు దానికి పర్మిషన్ రాదని ఇబ్బంది పెట్టడడం న్యాయం కాదని బాధితులు వేడుకుంటున్నారు. ముందే జీహెచ్ఎంసీ అధికారులు అమ్మడానికి ప్లాటును సిద్ధం చేస్తున్నప్పుడు అధికారులు తగిన చర్యలు తీసుకుంటే మాలాంటి అమాయకులు మోసపోరు కదా అంటున్నారు. ఇప్పటికీ కొన్ని ప్లాట్లను అమాయకులకు అమ్మడానికి సిద్ధం చేసి పెట్టారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు గొల్ల గూడ ప్రాంతాన్ని సందర్శించి అక్రమాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed