అలర్ట్: HYD మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తున్నారా?

by Disha Web Desk 16 |
అలర్ట్: HYD మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తున్నారా?
X

దిశ, వెబ్‌‌డెస్క్: హైదరాబాద్‌లో వాణిజ్య ప్రకటనలపై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రధాన సర్కిల్స్‌లో వాణిజ్య ప్రకటనలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం లేదు. దీంతో రాజకీయ నాయకులు, వాణిజ్య ప్రకటనకర్తలు మెట్రో పిల్లర్లు, రైల్వే స్టేషన్లను ప్రకటనల కేంద్రంగా మార్చుకున్నారు. వీటిన్నింటికీ చెక్ పెట్టేందుకు మెట్రో ఎండీ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతుల్లేకుండా మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.1000 వెయ్యి జరిమానాతో పాటు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.



Next Story