ALERT : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ బోర్డు కీలక ప్రకటన

by Rajesh |
ALERT : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ బోర్డు కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం (2024 -25)విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కోసం ఎలాంటి నోటిఫికేషన్ షెడ్యూలును జారీచేయలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అనధికార అడ్మిషన్‌లు చేసుకుంటున్నాయని పలు మాధ్యమాల్లో ప్రచారం సాగుతున్న తరుణంలో ఇంటర్ బోర్డు ఈ కీలక ప్రకటన చేసింది.

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల జాబితా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లలో tsbie.cgg.gov.in acadtsbie.cgg.gov.in లలో పొందుపరచడం పెరుగుతుందని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో పొందుపర్చిన కళాశాలలో మాత్రమే తల్లిదండ్రులు తమ పిల్లలను అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్‌ కంటే ముందుగానే అడ్మిషన్ ప్రక్రియ చేపడితే అట్టి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

అడ్మిషన్ షెడ్యూల్‌కు కంటే ముందు జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు తీసుకోవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన తెలుగు అధ్యాపకులు రాఘవేంద్ర రావు సూచించారు . ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్య , విశేష అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత విద్యార్థులకు బోధించడం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ కళాశాలలో విశాలమైన గదులు ,ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య విద్యార్థులకు చక్కటి విద్యాబోధనతో మంచిగా రాణించగలుగుతారని పేర్కొన్నారు.



Next Story

Most Viewed