భవిష్యత్‌లో భారత రాజ్యాంగం ఉంటుందా..? మోడీపై మాజీ IAS ఆకునూరి మురళి సెటైర్లు

by Disha Web Desk 19 |
భవిష్యత్‌లో భారత రాజ్యాంగం ఉంటుందా..? మోడీపై మాజీ IAS ఆకునూరి మురళి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. అయితే, సెంగోల్ ప్రతిష్ఠించే పూజా కార్యక్రమంలో మోడీ దానికి సాష్టాంగ నమస్కారం చేయడంపై ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి సోమవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

‘ఈ రాజదండము ఏందో. దానికి మన ప్రధాని సాష్టాంగ నమస్కారం చేయడం ఏందో. వీళ్లు దేశాన్ని రాజరికంలోకి తీసుకెళదామనా? అంటే పీఎం, సీఎంలు, మంత్రులు ఇక కిరీటాలు పెట్టుకోవాలా?. రాజ్యాంగం ఉంటుందా భవిష్యత్లో ?. తార్కిక ఆలోచన చేసే మనుషులు ఉంటే వాళ్ళకు ఇదేమీ అర్ధం కాదు’ అంటూ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు.



Next Story