ఆరంభించిన మొదటి ఏడాదే ‘అక్షరా’ అత్యుత్తమ ఫలితాలు

by Disha Web Desk 11 |
ఆరంభించిన మొదటి  ఏడాదే ‘అక్షరా’ అత్యుత్తమ ఫలితాలు
X

దిశ, మహబూబ్ నగర్: కళాశాలను ఆరంభించిన మొదటి ఏడాదే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అక్షరా జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాలలో కళాశాలకు చెందిన అస్మ బరిన్ అనే విద్యార్థిని బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించింది. అమీనా తయ్యభ అనే విద్యార్థిని 431 మార్కులు సాధించగా.. మరో 12 మంది విద్యార్థులు 400 కు పైగా మార్కులు సాధించారు.

ఎంపీసీ విభాగంలో సుహారిత్ భరద్వాజ 470 మార్కులకు గాను 464 మార్కులు, పి చందన 462, అమృత 461, నేహా 460 మార్కులు సాధించగా మరో 12 మంది విద్యార్థులు 450 కి పైగా మార్కులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, కార్యదర్శి పని ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటి, నీట్ పరీక్షలలో రాణించాలని వారు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

Next Story