సామాజిక సేవలో యువ కార్మికులు ముందు : శ్రీరాంపూర్ జీఎం

by Disha Web Desk 15 |
సామాజిక సేవలో యువ కార్మికులు ముందు : శ్రీరాంపూర్ జీఎం
X

దిశ,నస్పూర్ : సింగరేణి యువ కార్మికులు రక్తదాతలుగా మారి సామాజిక సేవలో ముందుంటున్నారని శ్రీరాంపూర్ జీఎం బి.సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 8 డిస్పెన్సరీ లో వృత్తి శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న ఉద్యోగులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్త దానం చేసిన 14 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆర్కే 8 డిస్పెన్సరీ ల్యాబ్ నందు నూతన సెమీ ఆటోమేటిక్ ఎనలైజర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈ సంవత్సరం శ్రీరాంపూర్ ఏరియాలో 17 రక్త దాన శిబిరాలు నిర్వహించామని, ఈ శిబిరాల ద్వారా 690 యూనిట్ల రక్తం రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేశామని, ఇలా సేకరించిన రక్తాన్ని తల సేమియా, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు,గర్భిణీ స్త్రీలకు,ప్రభుత్వ హాస్పిటల్ లోని నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నారని తెలియజేశారు. నూతన సెమి ఆటోమేటిక్ ఎనలైజర్ ద్వారా షుగర్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ సంబంధిత రక్త పరీక్షలను త్వరితగతిన పరీక్షించడానికి వీలుంటుందని, ఈ అవకాశాన్ని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిబిజికేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కె. సురేందర్ రెడ్డి, ఎంవిటిసి మేనేజర్ కె.వి.రామారావు, డివైజిఎం ఎంవిటిసి రాజేంద్రప్రసాద్, డివై సిఎంఓ డాక్టర్ రమేష్ బాబు, మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి, శిక్షణ కేంద్రం శిక్షకులు సమ్మయ్య, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Next Story