బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

by Dishanational1 |
బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
X

దిశ, లోకేశ్వరం: అభయ హస్తం పింఛన్ కోసం డబ్బులు చెల్లించి ఏళ్ళు గడుస్తున్నా ఎలాంటి పింఛన్లు అందడం లేదని, తాము చెల్లించిన డబ్బులైనా తమకు ఇప్పించాలంటూ ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని మహిళలు నిలదీశారు. ఆదివారం మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు రాగా పెద్ద సంఖ్యలో మహిళలు ఆయన వద్దకు వెళ్లి అభయహస్తం పింఛన్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి నెల నెలా డబ్బులు చెల్లించామని, ఏళ్లు గడుస్తున్నా అటు అభయహస్తం పింఛన్ గానీ ఇటు ఆసరా పింఛన్ గానీ అందడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి బతుకమ్మ చీరలను తీసుకున్నారు.



Next Story