బీఆర్ఎస్ తోనే మైనార్టీల సంక్షేమం : దివాకర్ రావు

by Kalyani |
బీఆర్ఎస్ తోనే మైనార్టీల సంక్షేమం : దివాకర్ రావు
X

దిశ, లక్షెట్టిపేట : బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు అన్నారు. సోమవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15వ వార్డులో నిర్వహించిన ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం సహాయం చేస్తోందని గుర్తు చేశారు. లక్షెట్టిపేట లో ముస్లిం, క్రైస్తవ మైనార్టీలకు ఫంక్షన్ హాళ్లు మంజూరు చేశామన్నారు. రంజాన్ పండుగ కానుకగా పేద ముస్లింలకు బట్టలు అందజేసి వారు పండగను సంతోషంగా జరుపుకునేలా చేసామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. రూ.400కే గ్యాస్ సిలిండర్, సామాజిక పింఛన్లు దశలవారీగా రూ.5 వేలకు పెంపు, రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పొరపాటున కాంగ్రెస్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రావన్నారు. గుండాయిజం, రౌడీయిజం చేసే, పేకాట క్లబ్బులు నడిపే కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ గర్ రావు కావాలా, ప్రజల మధ్యలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసే తాను కావాలో ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నాయకులు విజిత్ కుమార్ రావు, కట్ట చంద్రయ్య, పాదం శ్రీనివాస్, చాతరాజు రాజన్న, నడి మెట్ల రాజన్న, మెట్టు రాజు, షబానా సజ్జు, అన్వర్, నయీమ్, వజీర్, పూల సాధీక్, జావీద్, షాబు దాదా, గరిసె రవీందర్, రాందేని తిరుపతి, పెండెం రాజు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed