- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Ration cards : ఆరేళ్లుగా నిరీక్షణ…రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు
దిశ, కాగజ్‌నగర్ : పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే రేషన్ కార్డులతో అనేక ప్రయోజనాలుంటాయి. అయితే.. గత ప్రభుత్వం దాదాపు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులు (ఆహార భద్రత కార్డులు) జారీ చేయలేదు. వేలాది మంది దరఖాస్తులు చేసినా, అవి ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరులో భాగంగా మార్గదర్శకాల రూపకల్పన వైపు అడుగులు వేస్తోంది. డాక్టర్ సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని అమలుకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. ఆగస్టు 15 తరువాత ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు. దీనిపై కొత్త కార్డుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఆరేళ్లుగా ఎదురుచూపులే..
ఆహార భద్రత కార్డులో ఉండే ప్రతి వ్యక్తికి ఆరు కేజీల చొప్పున, అంత్యోదయ కార్డు కుటుంబానికి 35 కేజీలు, అన్నపూర్ణ కార్డు ద్వారా ఒక్కో సభ్యుడికి 10 కేజీల చొప్పున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2020 కరోనా నుంచి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నాయి. మరో వైపు రేషన్ కార్డులు ప్రతి పథకానికి ప్రామాణికం కావడంతో ప్రతి నెలా దరఖాస్తులు చేసుకునే వారుంటున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది. కేవలం మార్పులకు మాత్రమే అవకాశం కల్పించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మార్పులు చేర్పుల కోసం సైతం పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. కార్డుల మంజూరు కోసం ప్రజలు మీసేవా, తహసీల్దార్ కార్యాలయ చుట్టూ తిరిగి అలసిపోయారు. లబ్దిదారులకు పెళ్లిల్లై పిల్లలున్నా కార్డు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
అన్నింటికి రేషన్‌కార్డే ప్రామాణికం..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల లబ్ది పొందాలంటే రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షలకు పెంచింది. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహిళలకు ప్రతినెలా రూ.2500, యువ వికాసం వంటి పథకాలను అమలు చేయనుంది. ఆసరా పించన్లు అమలు చేయనుంది. ఈ పథకాల లబ్ది పొందాలంటే రేషన్ కార్డు అవసరం ఉంటుంది. లబ్దిదారుల ఎంపిక సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకపోవడంతో ఇన్నేళ్లు పథకాల లబ్ధికి ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఈ ప్రభుత్వమైనా కొత్త రేషన్ కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.