- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
గణేష్ నిమర్జనంలో తల్వార్ తో విన్యాసం

దిశ, మంచిర్యాల టౌన్ : గణేష్ నిమర్జనంలో భాగంగా జైపూర్ మండల నర్వ గ్రామంలో జరిగే వినాయక నిమర్జనంలో ఒక వ్యక్తి తల్వార్ తిప్పుతు డ్యాన్స్ లు చేయడం విమర్శలకు దారి తీసింది. ఒక వైపు పోలీస్ శాఖ తల్వార్ ఉపయోగించడం నేరం అని పలుసార్లు హెచ్చరించినప్పటికీ ఇంకా ఈ తల్వార్ కల్చర్ మారడం లేదు. గతంలో మంచిర్యాలలో ఓ పెళ్లి బరాత్ లో తల్వర్ ఉపయోగిస్తూ డ్యాన్సులు చేస్తుండగా పలువురికి గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లి బరాత్ జరిగే స్థలానికి చేరుకొని తల్వార్ ఉపయోగించిన వారి పై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. సంతోషంగా నిర్వహించుకునే గణేష్ నిమర్జనం, పెళ్లి బరాత్ లలో ఇలా తల్వార్ తిప్పుతూ చేసే విన్యాసాల వల్ల పలువురు గాయాల పాలైన సంఘటనలు ఎన్నో చూశాము. అయినప్పటికీ జిల్లాలో ఈ తల్వార్ కల్చర్ వీడడం లేదు. గణేష్ నిమర్జనంలో తల్వార్ ఉపయోగిస్తూ చేసిన విన్యాసాలు ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.