ఉన్నది రెండు చెట్లు.. తీస్తున్నది వందల లీటర్ల కల్లు

by Aamani |
ఉన్నది రెండు చెట్లు.. తీస్తున్నది వందల లీటర్ల కల్లు
X

దిశ,భైంసా : డ్రగ్స్ కలిపి చెట్ల కల్లు నీ అమ్ముతూ,మాఊరి యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, తానూరు మండలం మహాలింగి గ్రామస్తులు వాపోతున్నారు. సోమవారం రాత్రి బైంసా పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయానికి గ్రామస్తులు చుట్టుముట్టారు. గ్రామంలో ఉన్నది రెండు చెట్లని డ్రగ్స్ కలిపి వందల లీటర్ల లో చెట్ల కల్లును తయారుచేస్తున్నారని, దీంతో యువత డ్రగ్స్ మత్తలో పడి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. తప్పని గ్రామస్తులు తెలిపితే దుర్భాషలాడుతూ, పైపైకి వస్తున్నారని సీఐ కి తెలియజేశారు. డ్రగ్స్ కలిపి కల్లు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.

Next Story

Most Viewed