అలరించిన వశిష్ఠ వార్షికోత్సవం..

by Disha Web |
అలరించిన వశిష్ఠ వార్షికోత్సవం..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : జిల్లా కేంద్రంలోని వశిష్ఠ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. వశిష్ఠ విద్యా సంస్థల అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి సరోత్తం రెడ్డి, అధ్యాపకుడు సత్యపాల్ రెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి నజీర్ ఖాన్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడాలని ఉద్బోధించారు. పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను సత్కరించారు. వివిధ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. మహేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అఖిలేష్ కుమార్ సింగ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నయి. శాస్త్రీయ , జానపద నృత్యాలు అలరించాయి.Next Story