- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్ వెళ్లి ఉగ్రవాదులను హతం చేసింది మేమే: Amit Shah
- రజాకార్ పాలన అంతమొందించింది మేమే...
- ఓవైసీ చేతిలోనే కెసిఆర్ కారు స్టీరింగ్
దిశ, వెబ్ డెస్క్: భారతదేశంపై దండయాత్ర చేసిన ముష్కరులను పాకిస్తాన్ అంచులకు వెళ్లి హతం చేసిన చరిత్ర తమ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈరోజు దేశం ఇంత శాంతిగా ఉందంటే దానికి నరేంద్ర మోడీ పాలన మాత్రమేనని చెప్పారు. రజాకార్ పాలనను అంతమొందించింది కూడా తామేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మజ్లిస్ సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. ఓవైసీ, కేసీఆర్‌ను తరిమికొట్టాలని అమిత్ షా పిలుపునిచ్చారు
రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగిస్తుంటే ఓవైసీ కేసీఆర్ కారు స్టీరింగ్‌ను తన వద్ద ఉంచుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఈ ఇద్దరిని పారదొలితేనే పీడ విరగడవుతుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివాసులకు సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. దేశంలో ఆదివాసుల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ లక్ష కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. 2014 నుంచి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనతో ఉన్నారని చెప్పారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకొని ఆదివాసుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నామని కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలిపారు.