పట్టపగలే దొంగల బీభత్సం.. బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరీ

by Disha Web |
పట్టపగలే దొంగల బీభత్సం.. బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరీ
X

దిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేటలో రజక వాడలోని ఓ ఇంట్లో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా టైలరింగ్ షాపును నిర్వహిస్తున్న ఎర్రోజు శాంత అనే మహిళ ఉదయం ఇంటి తలుపు గడియకు తాళం వేసి షాప్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు గడియ తాళం పగలగొట్టబడి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తెరిచి ఉండి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గుర్తు తెలియని దొంగలు చోరీ చేసినట్లు గుర్తించిన మహిళ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఎస్సై లక్ష్మణ్ చేరుకుని ఆరా తీస్తున్నారు. బీరువాలో దాచుకున్న రూ.40 వేల నగదు, మూడు తులాల బంగారు హారం చోరీ జరిగినట్లు బాధితురాలు తెలిపారు.




Next Story

Most Viewed