- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కమలం అధ్యక్షులకు.. 60 ఏళ్లు దాటితే.. నో చాన్స్..!

దిశ ప్రతినిధి, నిర్మల్ : భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం ఇబ్బందికరంగా మారుతున్నది. అధిష్టానం తీసుకున్న 60 సంవత్సరాల వయసు నిర్ణయం అనేక మంది సీనియర్లను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోగా... జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఉంటే అధికార దర్పం తో పాటు హోదా ఉంటుందన్న ఆలోచనతో ఉన్న నేతలకు అధిష్టాన నిర్ణయం మింగుడు పడడం లేదు.
పెరిగిన పోటీ... వయసు రీత్యా నిరాశ...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాల అధ్యక్షుల నియామకాలకు సంబంధించి తీవ్రమైన పోటీ ఏర్పడింది. దీనిపై అధిష్టానం వయస్సు కారణం చూపి నీళ్లు చల్లింది. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్లకు తాజా నిర్ణయం ఆశనిపాతం గా మారింది. అధికార పదవులు దక్కక పోయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన వారికి సీనియర్లలో ఒకరికి జిల్లా అధ్యక్ష స్థానాలు దక్కితే గౌరవంగా ఉండేదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. నిర్మల్ జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి మరోసారి ఆ పదవిని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన అధ్యక్ష హోదాలో ఉండగా తన సొంత జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలిచారు. దీంతో ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. తాజాగా మరోసారి జిల్లా అధ్యక్ష పదవి ఆశించగా... 60 ఏళ్ల వయస్సు కారణంగా పదవికి దూరం అయ్యారు. దీంతో ఈ జిల్లాలో సామ రాజేశ్వర్ రెడ్డి, రవి పాండే ఇద్దరు నేతలు నడుమ పోటీ ఉంది. ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు బ్రహ్మానందం మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ జిల్లా మహిళా నేత జడ్పీ మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి తనకు జిల్లా అధ్యక్ష పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఆమెతో పాటు లోక ప్రవీణ్ రెడ్డి కూడా పదవిని ఆశిస్తున్నారు. బ్రహ్మానందం లేదా సుహాసిని రెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ మరోసారి అద్దె స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక కోణాల రీత్యా ఈ జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నాయి. కొయ్యల హేమాజి, దుర్గం అశోక్ ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వెంకటేశ్వర గౌడ్ పేరుతో పాటు మల్లారెడ్డి మరో ఇద్దరు నేతలు పదవి ఆశిస్తున్నారు. రఘునాథ్ ను మారిస్తే ఎస్సీ నేతకు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయని పార్టీ అధిష్టానం సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఆయన ఇటీవలనే నియామకం అయ్యారని చెబుతున్నారు. ఒకవేళ మార్చాల్సి వస్తే ఎస్టీ నేత కోట్నక్ విజయ్ లేదా బోన గిరి సతీష్ బాబు లలో ఒకరికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.