- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
దీపం శాపం గా మారింది...
దిశ, చింతలమానేపల్లి : మండలం లోని బాబా సాగర్ గ్రామంలో రెక్కాడితే డొక్కా ఆడని పరిస్థితుల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి దీపం శాపంగా మారింది. వివరాలలోకి వెళితే బాబా సాగర్ గ్రామానికి చెందిన కారు నిలేష, స్వప్న, ఇద్దరు కుమార్తెలు కలరు. గురువారం రాత్రి వెలుగు కోసం దీపం ను ముట్టించగా దీపం సమీపంలో టీవీ టేబుల్ పైన బట్టలు ఉండడంతో బట్టలకు నిప్పు అంటించుకుని ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. టేబుల్ డెస్క్ లో పత్తి అమ్మి ఉంచిన 20వేల నగదు, బట్టలు, విలువైన పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లు పూర్తి గా కాలిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని బాధితులు వేడుకున్నారు.
బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన నాయకులు..
కుటుంబ బాధితులకు సర్పంచ్ కుమారుడు,వార్డు సభ్యుడు కత్తెర్ల భీమేష్, చింతలమానేపల్లి బీఎస్పీ పార్టీ మండల ఇంచార్జి ,ఎంపీటీసీ జాడి తిరుపతి, బీజేపీ నాయకులు గొడిసెల మహేందర్ గౌడ్, అడపా శ్రీనివాస్, సత్పుతె రాకేష్, వార్డ్ సభ్యుడు నాగపూరి బాలు కలిసి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందజేశారు.