బ్రాహ్మణవాడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

by Disha Web Desk 20 |
బ్రాహ్మణవాడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఇరు వర్గాల వారు ఘర్షణపడటంతో వారి పై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చదరగొట్టారు. పోలింగ్ మందకొడిగా సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో గందరగోళం నెలకొంది.

ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓ వర్గం వారు అడ్డుకుంటున్నారని మరో వర్గీయులు పోలింగ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దింతో ఉద్రిక్తత చోటుచేసుకోగా, పోలీసులు ఆందోళన కారులను చెదరగోట్టేందుకు లాఠీ చార్జ్ చేయడంతో వారు పోలింగ్ స్టేషన్ వద్ద నుంచి వెళ్లిపోవడంతో ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేశారు.

Next Story