అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Disha Web Desk 15 |
అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, భీమిని : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కన్నెపెళ్లి మండలం ఎల్లారం గ్రామంలో ఐటీడీఏ నిధులతో రూ. 70 లక్షలతో మంజూరైన రోడ్డు నిర్మాణానికి ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి భూమి పూజ చేశారు. ఎల్లారం గ్రామంలో ఐటీడీఏ నిధులు రూ. 70 లక్షలు, ఆర్ అండ్ బీ రహదారి పూర్తిగా నిర్మించేందుకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం ఎల్లారం పోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నంబర్​వన్ గా దూసుకుపోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పథకాలను కాపీ కొడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు రూ.2016 పింఛన్ అందిస్తుందని, చత్తీస్గడ్ రాష్ట్రంలో రూ.500 పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. మీకు రూ.500 పెన్షన్ కావాలా లేక ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న రూ.2016 కావాలా అని సభా ప్రాంగణంలో ప్రశ్నించారు. దీంతో మాకు రూ.2016 కావాలి అంటూ సభలో మంత్రికి తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఊరికే జెండాలు పట్టుకొని తిరుగుతుందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని అన్నారు.

గిరిజనులకు అటవీ వనరులతో ఆదాయం

అటవీ ప్రాంతాల దగ్గర ఉండే గిరిజనులకు అటవీ వనరులతో ఆదాయం సమకూరుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నేన్నెల మండలంలో తునికి ఆకు సేకరణ బోనస్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కూలీలకు బోనస్ రూపంలో రెవెన్యూ ఆన్లైన్ నెట్ షేర్ ద్వారా అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ 200 కోట్లను బోనస్ చెక్కులను తునిగాకు సేకరణ కూలీలకు ప్రభుత్వం అందిస్తుందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిర్పూర్ నియోజకవర్గం లో తునికాకు సేకరణ కూలీలకు బోనస్ చెక్కుల కింద రూ. 27 కోట్లు మంజూరు చేసి అందించినట్లు చెప్పారు.

బెల్లంపల్లిలో రూ.10.45 కోట్లను తునికాకు సేకరణ కూలీల లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. బీడీ ఆకుల సేకరణ కట్టకు రూ 2.05 పైసలు ఉండగా రూ. 3 పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పీసీసీఎఫ్ ఆర్ డోబ్రీయల్, డీఎఫ్ఓ ఆసీస్ సింగ్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, ఎంపీటీసీ కర్రే లత, కన్నపెల్లి జెడ్పీటీసీ సత్య నారాయణ పాల్గొన్నారు.

Next Story

Most Viewed