అంధకారంలో IIIT.. అసలు వీరి సమస్యలు తీరేనా ?

by Dishanational2 |
అంధకారంలో IIIT.. అసలు వీరి సమస్యలు తీరేనా ?
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బాసర ట్రీబుల్ ఐటీ నిన్నటి నుంచి అంధకారంగా మారింది. సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం మధ్యాహ్నం అయిన కరెంటు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ట్రీబుల్ ఐటీ కాదు ట్రబుల్ ఐటీ అంటూ, సమస్యలకు నిలయం అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమస్యలు ఒకదాని వెనుక ఒకటి బాసర ట్రిపుల్ ఐటీనీ వెంటాడినట్లు ఉంది. ఎంతకీ కరెంట్ రాకపోవడంతో విద్యార్థులు మొబైల్‌లోని టార్చ్ లైట్‌ని ఉపయోగించి నిన్న రాత్రి భోజనం కానిచ్చేశారు. ఇంకొంతమంది విద్యార్థినీలు, కరెంటు వస్తుందిలే అంటూ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈమధ్య రోజుకోసారి బాసర త్రిబుల్ ఐటీ పెరు మార్మోగుతూనే ఉందటుంది.

కరెంట్ లేకపోవడంపై బాసర ట్రీబుల్ ఐటీ సిబ్బంది ఇచ్చిన వివరణ

కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రాన్ష్ ఫారం చేడిపోయిందని, మరమ్మత్తులు కొనసాగుతూనే ఉన్నాయని మరో కొంత సమయంతర్వాత విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. కరెంటు లేకపోవడంతో విద్యార్థులు లాప్ టాప్,సెల్ ఫోన్స్ లు చార్జింగ్ లేక, నిత్యాసరాలు తీర్చుకోవడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి నుండి కరెంటు లేక పోవడంతో విద్యార్థుల రక్తం దోమలకు అల్పాహారంగా మారిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్థం చేస్తున్నారు.


Next Story

Most Viewed