కరెంటు పెడితే కఠిన చర్యలు తప్పవు .. సీఐ రామ్ నర్సింహారెడ్డి

by Disha Web Desk 20 |
కరెంటు పెడితే కఠిన చర్యలు తప్పవు .. సీఐ రామ్ నర్సింహారెడ్డి
X

దిశ, మామడ : పంట రక్షణ కోసం అక్రమ కరెంటు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు. నాలుగు రోజుల క్రితం విద్యుత్ షాక్ తగిలి పొనకల్ గ్రామానికి చెందిన ధ్యాగల బోర్రన్న మృతి చెందాడు. దీంతో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి, కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అటవీ జంతువుల నుండి పంటలను రక్షించుకోవడానికి కంచె చుట్టు విద్యుత్ వైరు అమర్చి, ఓ వ్యక్తి మృతికి కారకుడైన గోనుగుప్పుల ఎర్రన్నను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఒకే రోజు విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story