విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ రాహుల్

by Disha Web Desk 11 |
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ రాహుల్
X

దిశ, భీమిని: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు మంగళవారం భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తడి పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తరగతి గదుల ముందు పైపు లీకేజీ అయి బురదమయం కావడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వెంటనే బురద ఉన్నచోట మట్టి వేయించాలని సూచించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను తడి పొడి చెత్త పై విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు, అనంతరం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. తిరిగి వెళ్లే సమయంలో వాహనంలో నుంచి చెత్తను పరిశీలించి వాహనాన్ని నిలిపేశారు.

అక్కడికి చేరుకున్న కార్యదర్శి సత్యనారాయణ రాజు పై నువ్వేం చేస్తున్నావని ప్రశ్నించారు. రహదారి గుండా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త కుప్పలను సాయంత్రంలోగా తొలగించి తనకు వీడియో పంపించాలని కార్యదర్శిని ఆదేశించారు. మండలంలో అసలు అధికారులు పనిచేస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి శిబిరం వద్ద అందరికీ తాగునీరు వసతులు కల్పించాలని పరీక్షలు చేసుకున్న వారికి 25 రోజుల్లో ఇంటి వద్దకే కళ్ళజోడులను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఫణిందర్రావు, వైద్యుడు కృష్ణ ఎంపీ ఓ సర్దార్ ఆలీ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ వైద్యురాలు కోడిపాక హర్షిత, ఏఈఓ మనిషా, ఏపీవో భాస్కరరావు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed