ఉడత సాయం.. బాగు బాగు

by Disha Web Desk 1 |
ఉడత సాయం.. బాగు బాగు
X

దిశ, చింతలమానేపల్లి: త్రేతాయుగంలో ఆ శ్రీరాముడికి ఉడత సాయం చేసిందని పురాణంలో ఉంది. అయితే.. కలియుగంలో కూడా మరో సారి ఉడత సాయం చేసింది. కానీ, ఈ సారి ఓ పక్షికి. వివరాల్లోకి వెళితే.. అడవిలో ఓ ఉడతకు మేడి పండు కనిపించింది. దానిని అది తినబోతుండగా జంగిల్ బబులర్ అనే పక్షి ఉడుత వద్దకు వచ్చి దాని వంక అలా.. చూస్తూ ఉంది. గమనించిన ఉడత ఆ మేడి పండును ఆ పక్షికి.. కావాలా అంటూ దాని నోటికి అందించబోయింది. ఈ అద్భుత దృశ్యాన్ని గురువారం ఆదిలాబాద్ జిల్లా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధించాడు.

Next Story

Most Viewed