- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి: ఎస్పీ గౌస్ ఆలం
దిశ,గుడిహత్నూర్: ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు.పోలీసులకు, యువతకు సత్సంబంధాలు మెరుగుపరచాలని జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ లొ వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు.ఈ టోర్నమెంట్ యొక్క ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన మూడు జట్టులకు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి విజేత మత్తడి గూడా జట్టుకు రూ.10,116, రెండవ బహుమతి సేవ దాస్ నగర్ జట్టుకు రూ 8016,మూడవ బహుమతి గుడిహత్నూర్ జట్టుకు రూ. 5116 షిల్డ్ మరియు నగదును అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలో పాల్గొనడం ముఖ్యమన్నారు. అందులో గెలుపోటములు సహజమన్నారు.యువత అన్ని క్రీడల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ టోర్నమెంట్ కు సహకరించిన పీఈటీలకు జిల్లా ఎస్పీ శాలువాతో సత్కరించి షీల్డ్ ను అందజేశారు. టోర్నమెంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి విజయవంతంగా కృషి చేసిన ఉట్నూర్ డీఎస్పీ సిహెచ్ నాగేంద్ర, ఇచ్చోడ సీఐ భీమేష్ లకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.