డిజిటల్ సేవలు అందించేందుకే రైతు నేస్తం కార్యక్రమాలు : జిల్లా కలెక్టర్

by Aamani |
డిజిటల్ సేవలు అందించేందుకే రైతు నేస్తం కార్యక్రమాలు : జిల్లా కలెక్టర్
X

దిశ,ఆదిలాబాద్ : పెరుగుతున్న ఆధునికతను దృష్టిలో ఉంచుకొని అన్నదాతలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందుకే రైతు నేస్తం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆద్వర్యం లో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం రైతు వేదిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ లో రైతు నేస్తం ద్వారా అన్నదాతలకు వీడియో కాన్ఫరెన్స్,డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా రైతు నేస్తం కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యల పై రైతులతో చర్చలు జరుపుకొని పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

గ్రామాల నుండే రైతులు ఆన్ లైన్ లో తమ పంటలకు సంబందించిన సలహాలు, సూచనలు అందుకోవడం , తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవడం వల్ల తెలియని విషయాలు తెలుసుకోవచ్చని తెలియ జేశారు.ఇది ప్రతి మంగళవారం రైతువేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రతి రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించాలని,ఈ కార్యక్రమానికి ఎక్కువగా మహిళా రైతులు హాజరయ్యేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పుల్లయ్య,డి సి ఓ మోహన్,డి ఏ ఓస్, ఏఈ వోస్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఇచ్చోడ మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి. ఎరువులు, విత్తనాల గిడ్డంగి ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిష్టర్ , బిల్ రశీదులను , నిల్వ ఉన్న ఎరువుల బ్యాగులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ బిల్ రిపోర్టు లో తేది, సమయం, రైతుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా కనెక్షన్ల సర్వే మొబైల్ ఆప్ ను పరిశీలించి,సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.



Next Story

Most Viewed