గ్రీన్ వర్సిటీ అవార్డు అందుకున్న ఆర్జీయూకేటీ వీసీ

by Disha Web Desk 11 |
గ్రీన్ వర్సిటీ అవార్డు అందుకున్న ఆర్జీయూకేటీ వీసీ
X

దిశ, బాసర: దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో క్యాప్ 28 గ్రీన్ జోన్ వర్సిటీ 2023 అవార్డును ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ శుక్రవారం యూఏఈ అధికారులు చేతుల మీదుగా అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ జోన్ ఏర్పాటు విభాగంలో ఈ అవార్డు ఆర్జీయూకేటీకి దక్కినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కొరకు చేపట్టిన చర్యలు, గ్రీన్ జోన్ ఏర్పాటు చేయడం, ఎకరాల ఎకో పార్క్ అధ్యాపకులలో హరిత అవగాహనను పెంపొందించడం. సిబ్బంది, విద్యార్థులు కాలుష్యాన్ని తగ్గించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్జీయూకేటీకి ఎంపిక చేయడం ఎంతో గర్వకారణమని తెలుపుతూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ హర్ష వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఆర్జీయూకేటీకి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపిక చేసినందుకు వీసీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆర్జీయూకేటిని ఉన్నత స్థాయిలో పచ్చదనం పరిశుభ్రమైన క్యాంపస్‌గా మార్చడంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల పాత్రకు గాను వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story