పోలింగ్ కేంద్రాల భద్రతను పరిశీలించిన రామగుండం సీపీ

by Disha Web Desk 20 |
పోలింగ్ కేంద్రాల భద్రతను పరిశీలించిన రామగుండం సీపీ
X

దిశ, వేమనపల్లి : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల భద్రతను ఆమె పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి వేమనపల్లి మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశామని వేమనపల్లి, నిల్వాయి పోలింగ్ కేంద్రం ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేయడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామని, ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు.

విధి నిర్వహణలో ఉన్న అక్కడి పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తరువాత పోలింగ్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాలకు తరలింపు గురించి పలు ఆదేశాలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గోడవలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రజలు అందరు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. ఆమె వెంట మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, మంథని సీఐ సతీష్, పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఎస్సైలు పాల్గొన్నారు.

Read More..

బ్రాహ్మణవాడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

Next Story