ఇండ్ల పట్టాల పంపిణీతో ప్రజల్లో ఆనందం

by Disha Web Desk 20 |
ఇండ్ల పట్టాల పంపిణీతో ప్రజల్లో ఆనందం
X

దిశ, రామకృష్ణాపూర్‌ : ఇండ్ల పట్టాల పంపిణీతో రామకృష్ణాపూర్‌ దశ దిశ మారనుందని, పూర్వ వైభవం రానుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామకృష్ణాపూర్ పురపాలకం బిజోన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన‌ నాలుగో విడత ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గురువారం 273 మంది లబ్ధిదారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్కసుమన్‌, పాలనాధికారి భారతి హోళికేరిలు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఆలోచన గత పాలకులకు రాకపోవడం చాలా దురదృష్టకరం అన్ని ఎద్దేవాచేశారు. సింగరేణి ఏరియాలో 1972 మందికి లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యపడిందని అన్నారు. రామకృష్ణాపుర్ పురపాలకంలో 140 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని, నూతనంగా నిర్మించిన 286 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉందని త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

దేశ సంపదను అంబానీ ఆదానీలకు దోచిపెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం మోడీ తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ, సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి కార్మికుల శ్రమ దోపిడీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ టాక్స్ మాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని అన్నారు. అయినా మోడీ పట్టించుకునే పాపన పోలేదని, మోడీ ఒంటెద్దు పోకడ వల్ల సింగరేణి సంస్థ కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ , అడిషనల్ కలెక్టర్ గౌతమి, తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed