ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించదు

by Naresh N |
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించదు
X

దిశ, ఆదిలాబాద్: జిల్లాలోని ఆయా మండల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వీకరించి పరిశీలించారు. తరం వాటిని సంబంధిత శాఖల అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో అనేక సమస్యల పై ప్రజలు ఒకటి కంటే ఎక్కువసార్లు ఒకే సమస్య పై పరిష్కారం కోరుతూ దరఖాస్తులను సమర్పిస్తున్నారని తెలిపారు ఎందుకు అధికారులు గతంలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆ సమస్యను పరిష్కరించకపోవడమే కారణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ఈ ఫిర్యాదుల విభాగంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మొహతో , వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story