జాతీయ విద్యావిధానాన్ని తిరస్కరించాలి..

by Disha Web Desk 20 |
జాతీయ విద్యావిధానాన్ని తిరస్కరించాలి..
X

దిశ, నిర్మల్ రూరల్ : ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు, కమిటీలు చేసిన సిఫారసుల మేరకు విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, విద్యార్థి సంఘం నాయకుల అక్రమఅరెస్టులు చేయడాన్ని విద్యార్థులు, మేధావులు ఖండించాలని పీడీస్ యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. కార్పొరేటు విద్యాసంస్థలను రద్దుచేయాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానాన్ని తిరస్కరించాలని కోరుతూ చలోఅసెంబ్లీకి పిలుపునిచ్చారు.

విద్యారంగం బలోపేతానికి చేస్తున్న డిమాండ్లను ఒప్పుకొని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తమనిజాయితీని నిరూపించుకోవాల్సిన తెలంగాణ ప్రభుత్వం, విద్యార్థులను, వెంటాడి వేటాడి అరెస్టులు చేయడం అత్యంత దారుణమని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పీడీస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి వాగ్మారే మహేందర్, వెంకటేష్, జిల్లా నాయకులు, ఆకాశ్, రాజారాం, నవీన్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.


Next Story