పత్తికి మద్దతుధర చెల్లించాలని రైతుల డిమాండ్..

by Disha Web Desk 20 |
పత్తికి మద్దతుధర చెల్లించాలని రైతుల డిమాండ్..
X

దిశ, తాండూర్ : పత్తికి మద్దతుధర చెల్లించాలని కోరుతూ మహాజన, రైతుహక్కుల పోరాటసమితి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, పాఠశాల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నారు. పట్టణంలోని వ్యాపార కూడళ్ళు జనం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. రైతుసంఘాల పిలుపు మేరకు జిల్లాలోని మండలాల నుండి రైతులు జిల్లా కేంద్రానికి పెద్దఎత్తున తరలివచ్చారు. పట్టణ శివారులోని పెద్దవాగు వద్దగల బైపాస్ రోడ్డుపై రైతులు, ప్రజాసంఘాల నాయకులు రెండుగంటల నుండి భైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. వాంకిడి మండలకేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు, ప్రజాసంఘాల నాయకుల రాస్తారోకో నిర్వహించారు.

రైతు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ రైతుల పట్లపాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆరుగాలం శ్రమించి పంటలు వేస్తే కనీసం మద్దతుధర ఇప్పించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు విఫలం చెందారని మండిపడ్డారు. పత్తిక్వింటాల్ కు కనీస మద్దతుధర 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికార ప్రజాప్రతినిధులు స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇరువైపుల భారీఎత్తున వాహనాలు నిలిచి రాకపోకలకు నిలిచాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed