మైనర్ బాలిక వివాహం.. అడ్డుకున్న అధికారులు

by Disha Web Desk 20 |
మైనర్ బాలిక వివాహం.. అడ్డుకున్న అధికారులు
X

దిశ, చింతలమానెపల్లి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బాలల సంరక్షణా అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే చింతలమానేపల్లి మండలంలోని రవీంద్రనగర్ -2 గ్రామంలో గురువారం మైనర్ బాలికకు వివాహం జరిపించాలని బాలిక తల్లిదండ్రులు ప్రయత్నించారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. అనంతరం అమ్మాయి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాస్కూర్ అలీ, ఎంపీడీఓ మహేందర్, ఏఎస్ఐ యాదవ్, జూనియర్ అసిస్టెంట్ పెంటు, కమిటీ సభ్యులు దుర్గం విజయ్, రత్నం పాపయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story