పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు : జిల్లా అదనపు కలెక్టర్

by Aamani |
పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు : జిల్లా అదనపు కలెక్టర్
X

దిశ,ఆసిఫాబాద్ : అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం వాడిగూడ ఈదుల వాడ, వాంకిడి మండలంలోని ఘాట్ జంగాం,మండోకర్ వాడ, గోయగాం గ్రామాల్లోని కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను డీపీవో బిక్షపతితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలకు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed