- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు: కలెక్టర్ రాజర్షి షా
దిశ, ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ప్రైవేట్ స్థలాలలో నిర్మాణాలు చేపట్టే వారు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకున్న తరువాతనే నిర్మాణాలు చేపట్టాలని,అలా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమి లేదా మున్సిపల్, గ్రామ పంచాయతీలలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలిపారు.
ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం చేసిన ఇళ్లు తో పాటు, మండల కేంద్రంలో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు సంయుక్తంగా పరిశీలించి ముందస్తు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వ భూమి లేదా మున్సిపల్, గ్రామ పంచాయతీలలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనీ, ప్రైవేటు స్థలాల్లో నిర్మాణాలు చేపట్టే వారు సంబంధిత అధికారుల నుండి అనుమతి తీసుకున్న తరువాతనే నిర్మాణాలు చేపట్టాలని, లేనియెడల తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.