రోగులకు అందుబాటులో లేని నిర్మల్ ప్రభుత్వ ఆసుప్రతి వైద్యులు

by Naresh N |
రోగులకు అందుబాటులో లేని నిర్మల్ ప్రభుత్వ ఆసుప్రతి వైద్యులు
X

దిశ, (నిర్మల్ రూరల్ ): నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తీరు అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అనే విధంగా తయారయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అన్ని రోగాలకు ఒకే రకమైన మందులు ఇస్తున్నారని, నిర్మల్ జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పి రిసిప్ట్ చింపడం తప్ప ప్రైవేట్ ఆస్పత్రి మీద ఉన్న తీపి ప్రభుత్వ ఆసుపత్రుల పై లేకపోవడం గమనార్హం. విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ వైద్యులు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండవలసిన వైద్యులు 1 గంటలకే వెళ్ళిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు మాత్రం వైద్యులు లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్క్రీనింగ్ మిషన్‌లు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదని వాటికి సంబందించిన సిబ్బంది లేకపోవడంతో రోగులు స్కానింగ్, ఇతర టెస్టుల కోసం బయటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నేను రాను సర్కారు దవాఖానకు అన్న విధంగా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరు:

ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ వైద్యుల కొరత ఉందని కొంతమందిని కాంట్రాక్ట్ నర్సులను తీసుకోవడం జరిగిందని, రెగ్యులర్ వైద్యులు కూడా డిప్యూటేషన్ పై వెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అనేక రోగాలకు సంబంధించిన ప్రజలు చికిత్స కోసం వస్తే సరైన చికిత్స అందించే వారు లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు చేసేది ఏమీ లేక ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో అధిక బిల్లులు జమా చేయాల్సి వస్తుందని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed