సొంతంటి కల సహకారానికి సింగరేణి వ్యాప్త పాదయాత్ర..

by Disha Web Desk 20 |
సొంతంటి కల సహకారానికి సింగరేణి వ్యాప్త పాదయాత్ర..
X

దిశ, మందమర్రి : 2023 ఏప్రిల్ మాసం నుండి సింగరేణి కాలరీస్ కంపెనీలో కార్మికులకు కొత్త వేతనాలు అమలులోకి వస్తాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) వేజ్ బోర్డ్ కమిటీ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం మందమర్రి ఏరియా కేకే - 5 గనిలో ద్వార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 11వ వేతన ఒప్పందం ఆశాజనకంగా ఉందని అన్నారు. కోల్ ఇండియాలో కొన్నిపరిశ్రమలకు 10 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం అమలులో ఉంటే కేవలం సింగరేణిలో ఐదు సంవత్సరాలకు ఒప్పందం చేసుకోవడం చారిత్రాత్మకమని స్పష్టం చేశారు. ఈ వేదన ఒప్పందం పై అవగాహన లేక కొన్ని తెలిసి తెలియక టీబీజీకేఎస్ సంఘం విమర్శలు చేస్తుందని అది వారి అవివేకానికి నిదర్శనమని తూర్పారపట్టారు.

రానున్న కాలంలో తమ యూనియన్ కాంట్రాక్టీకరణకు, ప్రవేటీకరణకు తామ యూనియన్ వ్యతిరేకం అన్నారు. రానున్న పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో సొంతింటి కల సహకారానికై, ఇన్కమ్ టాక్స్ రద్దు కొరకు మణుగూరు నుండి గోలేటి వరకు సింగరేణి వ్యాప్తంగా బాయిబాట కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. సింగరేణి సంస్థను రాజకీయ ఆర్థిక దోపిడి నుండి కాపాడుకోవాలంటే సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాదుని సుదర్శన్, కేకే-5 గని ఫిట్ కార్యదర్శి కొత్త తిరుపతి, కంది శ్రీనివాస్, మర్రి కుమార్, గాండ్ల సంపత్, భూమయ్య, రాజ్ కుమార్, బండి మల్లేష్, బుర్ర రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా 15 మంది యువకార్మికులు ఏఐటీయూసీలో చేరారు.


Next Story

Most Viewed