గరం గరంగా జిల్లా పరిషత్ మీటింగ్..

by Disha Web Desk 20 |
గరం గరంగా జిల్లా పరిషత్ మీటింగ్..
X

దిశ, మంచిర్యాల టౌన్ : జడ్పీ చైర్‌ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. గూడెం లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్ళ పైపులు పగిలి మండలలోని పొలాలకు నీళ్ళు అందక పొలాలు ఎండిపోతున్నాయని లక్సెట్టిపేట్ జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య , దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసి రకం పైపులు వాడినందున పైపులు పగులుతున్నాయని వాటి పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు.

కడెం ప్రాజెక్టులో కూడా తగినన్ని నీళ్ళు లేకపోవడంతో ఈ సారి ఏసంగి పంటలకు కూడా తగినంత వరకు నీళ్ళు అందక పోవచ్చునని కలెక్టర్ బదులిచ్చారు. జిల్లా సర్వసభ్య సమావేశానికి అధికారులు టైంపాస్ కోసం వస్తున్నారని, స్థానిక ఎంపీ వస్తే లేచి నిలుచోకుండా, ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జెడ్పీసీఈఓను నిలదీశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన జిల్లాసర్వసభ్య సమావేశం మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed