ఖబర్దార్ బీజేపీ నాయకుల్లారా.. నోరు అదుపులో పెట్టుకోండి

by Disha Web Desk 20 |
ఖబర్దార్ బీజేపీ నాయకుల్లారా.. నోరు అదుపులో పెట్టుకోండి
X

దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక బీజేపీ నాయకులు యాత్రల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తే నాలుక కోస్తాం అని ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ బీజేపీ నాయకులకు హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ బండి సంజయ్ అంటే మేధావి అనుకున్నా ఇంత చిల్లర మేధావి అని తెలవదు అని అన్నారు. పాదయాత్ర చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి నువ్వు ఏం తెచ్చావో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై నువ్వు, నీ అనుచరులు నిరాధార ఆరోపణలు చేస్తారా? సంజయ్ నీకు దమ్ముంటే ఈ నియోజకవర్గ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయి అని సవాల్ విసిరారు.

సోయం బాపురావు ఎంపీ కాకముందు నీకు ఉండేందుకు ఇల్లు కూడా లేకుండే. ఇప్పుడు నీకు ఉన్న ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. నేను నీలా కాదు రాజకీయాల్లోకి రాకముందే నేను ఒక బిజినెస్ మహిళను అని అన్నారు. ఎమ్మెల్యే కాకముందే నాకు 10 ఇండ్లు ఉండేవి అని, నీ లెక్క రాజకీయలు చేసి ప్రజలను రెచ్చకొట్టలేదని, నీ ఊక దంప్పుడు బెదిరింపులకు భయపడేదాన్ని కాదని అన్నారు. జీప్ క్లీనర్ గా పనిచేసిన రాథోడ్ రమేష్ కి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటికే నిన్ను రెండుసార్లు ఓడించా మళ్ళీ ఓడిస్తా అని రాథోడ్ కు సవాల్ విసిరారు. 20 ఏళ్ళు ఖానాపూర్ ప్రాంతాన్ని పాలించి ఏం చేయనందుకే ప్రజలు నిన్ను పక్కన కూర్చోబెట్టారని అన్నారు.

బీజేపీ నాయకులకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరినాయక్ చేసిన దందాలు ఎవరికి తెలియనివి, రైతు బిడ్డనని చెప్పుకుంటున్న నువు మీ అన్న ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇక్కడి రైతుల గోస తెలియదా, ఎందుకు పరిష్కరించలేదు అని ప్రశ్నించారు. తెరాస పార్టీలో అవినీతికి పాల్పడిన వారెంతటివారైనా పార్టీ సహించదని అన్నారు. అందుకే అవినీతికి పాల్పడిన పెంబి ఎంపీపీని సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ వహిద్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రాంనాయక్, టీఆర్ఎస్ నాయకులు పుప్పాల శంకర్, ఆకు వెంకగౌడ్, తల్లపెళ్లి రాజగంగన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story