- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
నాందేడ్ సభకు విస్తృత ఏర్పాట్లు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

దిశ, ప్రతినిధి నిర్మల్: మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బోధన్ ఎమ్మెల్యే షకీల్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సభాస్థలితోపాటు పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్లు, ఇతర పనుల ప్రగతిని పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌తో పాటు జాతీయ స్థాయి నేతలు వస్తున్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఫిబ్రవరి 5న నిర్వహించనున్న సభలో సీయం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. అదే విధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ మోడల్ తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో రానున్నరోజుల్లో జరగబోయే ఎన్నికలకు తమ పార్టీ సమాయత్తం అవుతుందని తెలిపారు. భావసారూప్యత కలిగిన వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, కేసీఆర్‌తో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.