గోమాతకు మందిర నిర్మాణం అద్భుతం.. లక్కడి సోదరులకు మంత్రి అల్లోల ప్రశంస

by Disha Web Desk 13 |
గోమాతకు మందిర నిర్మాణం అద్భుతం.. లక్కడి సోదరులకు మంత్రి అల్లోల ప్రశంస
X

దిశ ప్రతినిధి, నిర్మల్: సొంత ఖర్చులతో నిర్మల్ పట్టణంలో గోమాతకు తమ తల్లిదండ్రుల పేరిట గండి రామన్న దత్త సాయి ఆలయ సింగిల్ ట్రస్టీ లక్కడి జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ లక్కడి జైపాల్ రెడ్డిలు నిర్మించడం ప్రశంసనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయ ప్రాంగణంలో కీ.శే. లక్కడి కృష్ణవేణి, రాంరెడ్డి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు జగన్మోహన్ రెడ్డి, జైపాల్ రెడ్డి లు గోమాత మందిర నిర్మాణం పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ దినదినాభివృద్ధి చెందుతోందని, లక్కడి సోదరులు ఆధ్యాత్మిక సేవారంగాల ద్వారా తమ వంతు పాత్రను పోషిస్తున్నారని అన్నారు. నిర్మల్ వాసులు పూజించుకునేందుకు సకల దేవతలకు నిలయంగా భావించే గోమాతకు భవ్యమైన ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. జిల్లాలో ఆలయాల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని, రికార్డు స్థాయిలో ఆలయాలను అభివృద్ధి చేశామని చెప్పారు.

గోమాతను కొలిచేందుకు నిర్మల్ ప్రజలందరూ గోమాతను కొలిచేందుకు ఒక ఆలయం ఉండాలన్న తపనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని లక్కడి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు కృష్ణవేణి రామ్ రెడ్డిల పేరు మీదుగా రూ.15 లక్షలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇందులో గోమాత విగ్రహంతో పాటు గోవులు కూడా ఉంటాయన్నారు. వాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ నిర్మాణం గురించి ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, దేవరకోట చైర్మన్ లక్ష్మీనారాయణ, శ్రీకాళహస్తి ఆలయ కమిటీ సభ్యుడు కొరిపల్లి దేవేందర్ రెడ్డి, నందిగుండం వెంకటాచారి, కాంట్రాక్టర్ లక్కడి జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు చిలుక గోవర్ధన్, అడ్ప పోశెట్టి, బిట్లింగ్ నవీన్, డి. శ్రీనివాస్, ఆకోజి కిషన్, సుధాకర్,గోశాల నిర్వాహకుడు నందు, భక్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed