మట్కా పై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం

by Disha Web Desk 11 |
మట్కా పై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం
X

దిశ, కాగజ్నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం కాగజ్నగర్ మండలం చింతగూడ గ్రామంలో సట్టా‌ మట్కా ఆడుతున్న ఒకరిని టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్సై సందీప్ కుమార్ ఆధ్వర్యంలో చింతగూడలో తనిఖీలు చేపట్టగా అబ్దుల్ మెహమూద్ వద్ద మట్కా కు సంబంధించిన చిట్టీలు లభ్యం అయ్యాయి. అతని వద్ద రూ. 4320 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కాగజ్‌నగర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేసినట్టు టాస్క్ ఫోర్స్ సీఐ తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ మాట్లాడుతూ…జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఎక్కడైనా మట్కా, ఆన్లైన్ పోస్టింగ్, జూదం, పేకాట ఆడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ టాస్క్ లో ఎస్ఐ సందీప్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పిసి మధు, రమేష్, సంజీవ్ పాల్గొన్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed