మహిళ పై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

by Kalyani |
మహిళ పై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళ పై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడమే కాకుండా ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణానికి చెందిన ఓ మహిళ బంధువులు పంజాబ్ లో నివసిస్తున్నారని, కొన్ని అవసరాల నిమిత్తం అమృత్ సర్ కు చెందిన ఒక అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్ అనే వ్యక్తిని సంప్రదించగా, అసిస్టెంట్ ట్రెజరర్ నిరాకరించిన కారణంగా అతనిని మహిళ తరపు బంధువులు విజిలెన్స్ అధికారులకు పట్టించారని తెలిపారు.

ఈ కారణంగా వారిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మునీష్ కుమార్ అనే నిందితుడు ఆదిలాబాద్ కు చెందిన మహిళపై ఫేక్ ఫేస్బుక్ ఐడి ని క్రియేట్ చేసి,అందులో మహిళ చిత్రాలను మార్ఫింగ్ చేసి, ఫేస్బుక్ లో ఉంచి, లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కారణంగా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ బృందం సహకారంతో, ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితున్ని గుర్తించి అమృత్ సర్ నుండి ఆదిలాబాద్ కు తీసుకువచ్చి, ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుడు అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.



Next Story

Most Viewed