'మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

by Dishanational1 |
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
X

దిశ, బోథ్: దేశంలోని ప్రతి మహిళ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని బోథ్ సివిల్ జడ్జి బి. హుస్సేన్ అన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ న్యాయ సదస్సులలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానులేని, స్త్రీ, పురుషులు లింగ వివక్షకు తావు లేకుండా పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన హక్కులు, పనికి తగు వేతనం సమానంగా ఉండాలని ఉన్నారు. ప్రతి మహిళ తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి విద్యను అందించాలని అన్నారు. బాల కార్మికుల నిర్మూలన కోసం మహిళలు నడుముకట్టాలన్నారు. మహిళలు ఆపదలో వుంటే వెంటనే 100 కు డయల్ చేసి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రెటరీ న్యాయవాది పంద్రం శంకర్, న్యాయవాది కుమ్మరి విజయ్, పీసీ విజయ్, ఐకేపీ ఏపీఎం మాధవ్, సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed