పండుగ రోజు ఆ ఉద్యోగులకు శుభవార్త

by Dishanational1 |
పండుగ రోజు ఆ ఉద్యోగులకు శుభవార్త
X

దిశ, కాసిపేట: మండలంలోని కాసిపేట్ -2 ఇంక్లైన్ లో 15 మంది ఉద్యోగులకు వివిధ కేటగిరీలో టైం రేటెడ్ వాకాన్సీస్ ప్రమోషన్స్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 15 ఉద్యోగులకు (3- కోల్ కట్టర్, 3 ట్రామర్, 1 లైన్ మన్, 5 సపోర్ట్ మన్, 1 టబ్ రిపైర్ మద్దూరు, 1 హామర్ మన్ (రోప్)) ప్రమోషన్స్ వచ్చినట్లు తెలిపారు. ప్రమోషన్స్ వచ్చినవారికి గురువారం ప్రమోషన్స్ పత్రాలు అందించారు. అనంతరం గని మేనేజర్ మాటురి రవీందర్ మాట్లాడుతూ ప్రమోషన్స్ పొందిన ఉద్యోగులు ఉత్పత్తి ఉత్పాదకత పెంచే విధంగా నైపుణ్యంతో పని చేయాలని, సింగరేణిలో కాసిపేట -2 పేరును పెంచాలని పిలుపునిచ్చారు. 2021 - 22 సంవత్సరానికి సంబంధించిన సీఎంపీఎఫ్ చిట్టీలను ఉద్యోగులకు అందజేశారు. శ్రీ రామనవమి సందర్భంగా అధికారులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమములో అధికారులు, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ కారుకూరి తిరుపతి, ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ గొల్ల శ్రీనివాస్, పిట్ ఇంజినీర్ బోధిరెడ్డి రఘు, సంక్షేమ అధికారి భార్గవ్, ఉద్యోగులు పాల్గొన్నారు.


Next Story