భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించండి: పావని

by Dishanational1 |
భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించండి: పావని
X

దిశ ప్రతినిధి, నిర్మల్: భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించాలని బాసర ఆర్జీయుకేటీ ప్రొఫెసర్ డా. పావని సూచించారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల వర్క్ షాప్ ముగింపు సభలో గురువారం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో నిర్వహించిన వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా డా. పావని హాజరై మాట్లాడుతూ నీరును, భూగర్భ జలాలను ఎలా నిలువ చేసుకోవాలో చెప్పారు. రిసోర్స్ పర్సన్-2 నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నీరు ఎలా మిగిల్చాలో.. ఎలా వర్తమానంలో వాడుకోవాలో.. వాటి పద్ధతులను తెలిపారు.

భైంసా డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్ సదస్సులో పాల్గొని నీటి వాడకం ఎలా ఉండాలో వివరించారు. డా. జె భీమా రావు మాట్లాడుతూ నీరు లేకపోతే మానవ మనుగడ అసాధ్యమని, అలాగే నీటి ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఈ సదస్సులో వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందించారు. పోస్టర్ మేకింగ్, ఉపన్యాసము, వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వర్క్ షాపులో కన్వీనర్ బి. రమాకాంత్ గౌడ్, కో కన్వీనర్ వి. సరితా రాణి, కో-ఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, రవి కుమార్, పీజీ రెడ్డి, అజయ్, రఘు, ఉమేష్, డా సుధాకర్, డా. శంకర్, శ్రీ హరి, నర్సయ్య, పవన్ కుమార్, నరేందర్, నాగేశ్వర్, దిలీప్, డా. రజిత, డా. రంజిత్, మురళీ ధర్, రవీందర్, ఆప్రీన్ సుల్తానా, సత్యం, శ్రీనివాస్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed