ఉద్యోగాల పేరిట 16 లక్షలు టోకరా..

by Disha Web Desk 13 |
ఉద్యోగాల పేరిట 16 లక్షలు టోకరా..
X

దిశ, క్యాతన్ పల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువకుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన మందమర్రి పట్టణంలో చోటు చేసుకుంది. గుడిపెల్లి, జైపూర్, శ్రీరాంపూర్‌లకు చెందిన యువకులకు మందమర్రి సింగరేణి సెక్యూరిటి విభాగంలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు పెట్టిస్తామని 16 లక్షలు వసూలు చేశారు. ఈ విషయాన్ని బాధితులు మందమర్రి సీనియర్ సెక్యూరిటీ అధికారిని ఆశ్రయించడంతో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు.


వివరాల్లోకి వెళితే.. గత మూడు నెలల కిందట రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డు కొలా మహేశ్వర్ రావు అనే వ్యక్తి బాధితులకు కాంట్రాక్ట్ గార్డ్ ఉద్యోగంలో చేర్పించినట్లుగా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ పేరు మీదుగా నకిలీ ఐడీ కార్డులను పంపిణీ చేశాడు. తమతో మంచిర్యాల పట్టణ శివారులో వారితో కొన్ని రోజులుగా విధులు నిర్వహించేవాడని, బాధితులకు అనుమానం రావడంతో సీనియర్ సెక్యూరిటీ అధికారిని కలిసి జరిగిన విషయాన్ని తెలియజేశారు. బాధితులు తమ న్యాయం చేయాలని సీనియర్ సెక్యూరిటీ అధికారి రవి ని కోరారు. దీంతో కోలా మహేశ్వర్ రావు పై మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.


Next Story

Most Viewed